కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- May 01, 2024
యూఏఈ: బుధవారం ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొన్ని పశ్చిమ ప్రాంతాల్లో ఇసుక, ధూళితో కూడిన తాజా గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దుమ్ము కారణంగా విజిబిలిటీ 2000 మీటర్ల కంటే తక్కువకు తగ్గుతుందని పేర్కొంది. ముందు రోజు సాధారణంగా పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని,ద్వీపాలు మరియు కొన్ని తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అరేబియా గల్ఫ్‌లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అంచనా వేశారు. అలల ఎత్తు ఆఫ్‌షోర్ 7 FTకి చేరుకుంటుందన్నారు. ఉష్ణోగ్రతలు అంతర్గత ప్రాంతాల్లో గరిష్టంగా 42ºC మరియు పర్వతాలలో కనిష్టంగా 17ºCకి చేరుకుంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







