కాలేజీ స్టూడెంట్స్ కోసం 'స్టూడెంట్ పార్కింగ్'
- March 26, 2017రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), స్టూడెంట్ పార్కింగ్ పేరుతో సబ్స్క్రిప్షన్ కార్డుల్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దుబాయ్ ఎమిరేట్‌లోని కాలేజీ స్టూడెంట్స్, యూనివర్సిటీస్ మరియు హయ్యర్ ఎకడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి చెందిన విద్యార్థులకు ముందుగా వీటిని అందిస్తారు. క్యాంపస్ నుంచి 500 మీటర్ల పరిధిలోని పార్కింగ్ స్లాట్స్‌ని విద్యార్థులు వినియోగించుకునేందుకు వీలుగా ఈ కార్డుల్ని రూపొందించినట్లు ఆర్టిఎ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజ్సె డైరెక్టర్ ఉసామా అల్ సఫి చెప్పారు. ఎ, బి, సి, డి కోడ్స్‌తో మూడు నెలలకుగాను 300 దిర్హామ్‌ల ఖరీదుతో ఈ కార్డులు అందుబాటులో ఉంటాయి. యూనివర్సిటీ సర్టిఫికెట్ లేదా కాలేజీ గుర్తింపు కార్డు ద్వారా 'స్టూడెంట్ పార్కింగ్' కార్డ్స్‌ని పొందవచ్చు. ఒక కార్డు మీద అత్యధికంగా మూడు వాహనాల్ని మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఒక్క వాహనం ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం