మరణశిక్ష నుంచి 10 మంది భారతీయులకు ఉపశమనం లభిస్తుందా?

మరణశిక్ష నుంచి 10 మంది భారతీయులకు ఉపశమనం లభిస్తుందా?

అల్‌ అయిన్‌ జైల్‌లో ఉన్న పది మంది భారతీయ యువకులు మరణశిక్ష నుంచి ఉపశమనం పొందుతారా? అని వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. ఓ పాకిస్తానీ వ్యక్తిని హత్య చేసిన కేసులో మొత్తం 11 మంది నిందులు కాగా, అందులో ఒకరికి మరణశిక్ష నుంచి మినహాయించారు. మిగతా 10 మందికి మరణ శిక్ష పడగా, మృతుడి తండ్రి నుంచి వారికి క్షమాభిక్ష లభించింది. 'నా కొడుక్కి జరిగినట్లే వారికీ జరగాలని కోరుకోవడంలేదు. నా కుటుంబం చాలా నష్టపోయింది, అలాగే వారి కుటుంబాలు నష్టపోకూడదని కోరుకుంటున్నాను' అని మృతుడు మొహమ్మద్‌ ఫర్హాన్‌ తండ్రి చెప్పారు. దాంతో, ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి 'బ్లడ్‌ మనీ'ని ఇప్పటికే కోర్టులో డిపాజిట్‌ చేయడం జరిగిందని అబుదాబీలోని ఇండియన్‌ ఎంబసీ కౌన్సిలర్‌ - కమ్యూనిటీ ఎఫైర్స్‌ దినేష్‌ కుమార్‌ చెప్పారు. ఏప్రిల్‌ 12న ఈ కేసు హియరింగ్‌కి రానుంది. 'బ్లడ్‌ మనీ'ని సర్బత్‌ దా బాలా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చెల్లించిందని సంస్థ ఛైర్మన్‌ ఎస్‌పిఎస్‌ ఒబెరాయ్‌ చెప్పారు. 
 

Back to Top