శి(థి)లాక్షరాలు....!!
- March 26, 2017
అంతుపట్టని మనసు మధనానికి
అక్షర రూపమివ్వడానికి ఆత్రపడే
కలానికి సాయంగా మిగిలిన
తెల్ల కాగితం చిన్నబోతోంది
కాలంతో పోటీగా పరుగులెత్తే మది
అలసట తెలియక అడుగులేస్తునే
అసంతృప్తిగా అడ్డు పడుతున్న
భావాలను నిలువరించాలని చూస్తోంది
గత జన్మాల ఖర్మ ఫలితాలకు
సాక్ష్యంగా నుదుటిరాతల గీతలు
చేతిలోని రాతలుగా మారుతూ
వెలుగు చూస్తున్న తరుణమిది
మనుష్యులతో అల్లుకున్న బంధాలు
మానసాన్ని వీడలేక వెలువరించే
శి(థి)లాక్షరాలు చీకటికి చుట్టాలుగా చేరక
చెదరని శిల్పాలై వెన్నెలకాంతులు వెలువరిస్తాయి...!!
ప్రపంచ కవితా పండుగ రోజు శుభాకాంక్షలు అందరికి ....!!
- మంజు యనమదల
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









