అమెరికా 'హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆంధ్రుడు
- April 13, 2017అమెరికా ఒహయో రాష్ట్రంలోని టోలెడో మెడికల్ అండ్ లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయం హాల్ ఆఫ్ ఫేమ్‌లో తెలుగు వైద్యుడు వాడరేవు రాజుకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజు 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆ తరువాత భారత్‌లోనే ఇంటర్న్‌షిప్, రెసిడెన్సీ పూర్తి చేసిన ఆయన ఇంగ్లండ్‌లోని సర్రేలోని ఓ ఆసుపత్రిలో అత్యవసర విభాగం అధికారిగా పనిచేశారు.
1984 నుంచి క్లినికల్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఈఎఫ్ఏ)కు రాజు వ్యవస్థాపకుడు, మెడికల్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ వర్జీనియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే 14 దేశాల్లో తన సేవలను ప్రారంభించడంతో పాటు భారత్‌లో కంటి ఆసుపత్రులను స్థాపించింది.
తాజా వార్తలు
- అల్ ముర్తాఫా గారిసన్ మసీదులో సుల్తాన్ ఈద్ ప్రార్థనలు
- సౌత్ 7వ రింగ్ రోడ్డులో అగ్నిప్రమాదం
- షార్జా విమానాశ్రయంలో ప్రయాణికులకు బహుమతులతో స్వాగతం
- పేషెంట్ భద్రతలో SSIలు కీలకం..!
- అరాఫత్.. 42.2 మిలియన్ కాల్స్, 5.61 వేల TBడేటా వినియోగం
- గోధుమ రవ్వ ధరల పెరుగుదల.. ఆహార భద్రతకు ముప్పు..!
- తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ..
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డిపార్చర్ గెట్ వద్ద కొత్త డ్యూటి ఫ్రీ స్టోర్
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు..!
- జూన్ 18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల