జూన్ 18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
- June 17, 2024తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
జూన్ 21న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
జూన్ 22న అంగప్రదక్షిణం టోకెన్లు….
సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల ఆన్ లైన్ కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా సెప్టెంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
జూన్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
జూన్ 27న శ్రీవారి సేవ కోటా విడుదల
జూన్ 27న తిరుమల–తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
https://ttdevasthanams.ap.gov.inవెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
తాజా వార్తలు
- తెలంగాణలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
- భారీ భూకంపంతో కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు
- చికాగోలో NATS ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
- అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్
- అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!
- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- 'దుక్మ్-1' రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒమన్..!!
- బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్‌లకు స్వాగతం..!!