షార్జాలో జోరందుకున్న 'గల్ఫీ' ప్రమోషన్

గల్ఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా షార్జా లో ని ఇండస్ట్రియల్ ఏరియా 17 లో గల్ఫీ కాంటెస్ట్ నిర్వహించటం జరిగింది. షార్జా ఏరియా ప్రమోషనల్ అంబాసిడర్ రాజేష్ వేమూరి అక్కడి కాంపుల్లో ఉన్న తెలుగు వారితో సినిమా విశేషాలు పంచుకున్నారు. గల్ఫ్ లో కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలు ,వారు ఇక్కడికి రావటానికి ప్రేరేపించిన ఇండియాలో పరిస్థితుల మీద చర్చిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.గతంలో శ్రీ సునీల్ కుమార్ రెడ్డి పలు సామాజిక ఇతివృత్తాల ని కధాంశంగా చేసుకుని చిత్రాలని రూపొందించారు. మత్స్య కారుల పోరాటం మీద తీసిన గంగపుత్రులు సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డులు గెలుచుకుంది. అలాగే తెలంగాణ నుండి వలస వచ్చిన గల్ఫ్ కార్మికుల వ్యధ ని ఇతివృత్తంగా చేసుకుని , మంచి ఆశయంతో రూపొందిన గల్ఫ్ సినిమా ని విజయవంతం చేయాలని ఇక్కడి తెలుగు వారికి రాజేష్ వేమూరి విజ్ఞప్తి చేశారు. 

Back to Top