ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు..!
- June 17, 2024అమరావతి: ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సహా 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. ఈసారి క్యాబినెట్ లో పార్టీలో సీనియర్లను కాదని చంద్రబాబు కొత్తవారికి అవకాశం కల్పించారు. అయితే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సీనియర్ నేతలకు అప్పగించే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ రేసులో పలువురు టీడీపీ సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చింతకాయల అయ్యన్న పాత్రుడికి స్పీకర్ గా అవకాశం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడి పేరును దాదాపు ఖరారు చేసినట్లు, త్వరలోనే ఆయన పేరును ప్రకటిస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీ ఎమ్మెల్యేకు దక్కే అవకాశం ఉంది. జనసేన నుంచి నెల్లిమర్ల (విజయనగరం) ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
చీఫ్‌విప్‌గా టీడీపీ సీనియర్ నేత దూళిపాల నరేద్ర పేరును సీఎం చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసినట్లు, త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో విప్రో విస్తరణ
- ముహరఖ్ లో జాతీయ స్టేడియం..ఎంపీల ప్రతిపాదన..!!
- ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం