ఆ ఇల్లు ఎవరిది?
- June 16, 2017ఆ ఇంట్లో
కొక్కేలకి కవితలు వ్రేలాడుతున్నాయి;
దండేలపై అక్షరాలు ఆరేసున్నాయి;
కుండీల్లో రంగురంగుల గజళ్లు
అద్దాల అల్మరాలో గేయాలు
అగరుపొగల్లో పద్యాలు
గుబాళిస్తున్నాయి;
తివాచీలపై రుబాయీలు
దీవాన్ దుప్పటిపై కావ్యాలు
టీపాయ్ మీద హైకూలు నానీలు
అద్దబడి ఉన్నాయి;
ఆ దంపతులు తత్సమాల్లా,
పిల్లలు తద్భవాల్లా ఉన్నారు;
గదుల మధ్య సంధులున్నా
వారి బంధాలు సమాసాల్లా ఉన్నాయి;
ఆలోచనలు సంయుక్తాలైనా
వారి నిర్ణయాలు ద్విత్వాలవుతున్నాయి;
వంటల్లో వ్యాకరణం,
వడ్డింపులో ఛందస్సు ఉన్నాయి;
చూపుల్లోనే శబ్దాలు,
నవ్వుల్లోనే అర్ధాలు ఉన్నాయి;
ఆ ఇల్లు ఎవరిదోగాని-
కళ్లు మూసుకుంటే కనిపిస్తోంది,
తెరిస్తే మాయమౌతోంది.
-సిరాశ్రీ
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!