లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- December 13, 2025
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఇవాళ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది.
మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నిర్వహించిన ఈ మ్యాచ్‌లో మెస్సీ టీమ్‌పై సింగరేణి ఆర్ఆర్ టీమ్ 3-0 గోల్స్‌తో గెలిచింది. ఆర్ఆర్ టీమ్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి ఆడి ఓ గోల్ కొట్టారు. ఇందులో మెస్సీ, రేవంత్ రెడ్డి ఆడింది 5 నిమిషాలపాటే.
అనంతరం, ఇరు జట్లకు మెస్సీ పతకాలు అందజేశారు. ఇక్కడకు వచ్చి తెలుగు వారిని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి వారు చూపించిన అభిమానం ఎంతో శక్తినిచ్చిందని చెప్పారు.
కాగా, మ్యాచ్‌కి ముందు ఇరు టీమ్‌లతో మెస్సీ, రేవంత్ రెడ్డి ఫొటోలు దిగారు. ఈ మ్యాచ్‌ను రాహుల్ గాంధీ కూడా చూశారు. అలాగే, ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె కూడా స్టేడియానికి వచ్చారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







