కోజి వర్దరైచకరి
- October 01, 2017కావాల్సిన పదార్థాలు: చికెన్ - ఒక కిలో, కొబ్బరి తురుము - అర కప్పు, కరివేపాకు - ఒక రెబ్బ, మిరియాలు - ఐదు గ్రాములు, గరం మసాలా - ఒక టీ స్పూను, సోంపు - ఒక టీ స్పూను, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - ఒక టీ స్పూను, వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూను, కొబ్బరినూనె - 100 గ్రాములు, పచ్చిమిరపకాయలు - ఆరు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట.
తయారీ విధానం: చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో కొబ్బరినూనె పోసి వేడెక్కాక కొద్దిగా కొబ్బరి తురుము, మిరియాలు, కరివేపాకు వేసి ఎర్రగా వేగించాలి. కారం, పసుపు, ధనియాల పొడి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారాక దీన్ని ముద్దగా రుబ్బుకోవాలి. ఇందులో గరంమసాలా, సోంపు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి వేసి మళ్లీ వేగించాలి. చికెన్ వేసి ఎర్రగా వేగాక ఉప్పు, మిగిలిన కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివర్లో కొత్తిమీర తురుము వేసి దించేయాలి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!