13న వస్తున్న 'అందమైన జీవితం'
- October 08, 2017మేఘవర్ష క్రియేషన్స్ పతాకంపై, మలయాళం లో సంచలన విజయం సాధించిన 'జొమోంటే సువిశేషంగాళ్' చిత్రాన్ని 'అందమైన జీవితం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు అభిరుచి గల నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు. సత్యన్ అంతిక్కాడ్ ఈ చిత్రానికి దర్శకుడు. దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, అక్టోబర్ 13న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ..'ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని, ప్రేమికుల మధ్య వుండే ప్రేమని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమే అందమైన జీవితం. సంగీతానికి మంచి ఇంపార్టెన్స్ వున్న మ్యూజికల్ హిట్ చిత్రమిది. మలయాళం లో ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లో నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. అక్టోబర్ 13న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము.. అని అన్నారు.
దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్, మాటలు: ఘంటసాల రత్నకుమార్, ఎడిటింగ్: ఈ. ఎమ్. నాగేశ్వరరావు, ఫోటోగ్రఫీ: ఎస్. కుమార్, పాటలు: శ్రీరామమూర్తి, సమర్పణ: పత్తిపాటి శైలజ, నిర్మాత: పత్తిపాటి శ్రీనివాసరావు, దర్శకత్వం: సత్యన్ అంతిక్కాడ్.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ మద్దతు