బతుకు- బతికించు

షేరింగ్ ఈస్ కేరింగ్
బతుకు- బతికించు

తనిష్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఏకైక సంతానం. తనిష్ చదువులో మంచి మార్కులు తెచ్చుకుఉంటాడు. వాళ్ళ తల్లి తండ్రులకి తనిష్ గురించి ఒక్కటే చింత. ఏకైక సంతానం కావడం అదీ వాళ్ళ దగ్గర బంధువులంతా అమెరికాలో, ఇండియాలో వుండటం వలన, తనిష్ కి షేరింగ్ నేచర్ రాదేమో అన్న భయం. 

తనిష్ కొత్తవారితో మాట్లాడడానికి సిగ్గుపడినా పబ్లిక్ స్పీకింగ్ లో ఎటువంటి తడబాటు లేకుండా మాట్లాడగలడు.
తల్లి తండ్రుల భయాలకు అతీతంగా, పెరిగే కొద్దీ తనిష్ ఎవరికైనా తనవంతు చేతనైన సాయం చేయాడం మొదలుపెట్టాడు. 
దుబాయ్ లో హోల్సేల్ కూరగాయల మార్కెట్ యార్డ్ లో దిన సరి కార్మీకులకు ఆర్ధిక సహాయం చెయ్యటం తో మొదలుకొని, మానసిక రోగుల ఆసుపత్రికి శ్రమదాన కార్యకర్తగా పని చేసి తన వంతు వీలైంత విరాళాలను పోగు చేసాడు. 
ప్రస్తుతం అల్ వర్క అవర్ ఓన్ బాయ్స్ స్కూల్  లో పదవ తరగతి లో చదువుతున్న తనిష్, ఇయర్ అఫ్ గివింగ్ తో స్ఫూర్తి చెందిన తనిష్, హైదరాబాద్ లో పేద విద్యార్థుల స్కూల్ ఫీజు  అలాగే ఒక ఫ్యామిలీకి నెలకు సరిపోయేలా రేషన్స్ స్పోన్సర్ చేసాడు. 
కోట్లకు కోట్లు కూడబెట్టి నెంబర్ వన్ ధన్వంతుండ్ని అనిపించోకువాలనే ఈనాటి సమాజాములో తనకున్న దానిలో ఇతరులతో పంచుకోవాలనుకునే తనిష్ లాంటి యువకుల అవసరం ఎంతైనా వుంది.తనిష్ కు మాగల్ఫ్.కామ్ తరపున ప్రత్యేక అభినందనలు.

Back to Top