ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం ప్రాణాలను లెక్కచేయని దుబాయ్ పోలీసుకు సత్కారం

- October 08, 2017 , by Maagulf
ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం ప్రాణాలను లెక్కచేయని దుబాయ్ పోలీసుకు సత్కారం

దుబాయ్: షైక్ జాయెద్ రోడ్డుపై ట్రాఫిక్ అవరోధాలను సరిదిద్దడానికి ఒక దుబాయ్ పోలీస్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెగించి రద్దీని క్రమబద్ధీకరించాడు. ఆ పోలీస్ యొక్క కర్తవ్యదీక్షకు విధుల నిర్వహణలో ఆయన చూపిన  బాధ్యతను గౌరవిస్తూ ఆ దుబాయ్ పోలీసును ట్రాఫిక్ పోలీసులను గౌరవించారు. రహదారిలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన కారణంగా ట్రాఫిక్ ప్రమాదాలు జరిగే అవకాశాలను ఆయన గుర్తించాడు. ట్రాఫిక్ జనరల్ డిపార్టుమెంట్ నుండి పోలీస్ అధికారి మహది తసీం కస్సమ్ తన వాహనం నుండి బయటికి దిగి వచ్చాడు. అంతేకాకుండా  ఆ మార్గంలో  ట్రాఫిక్ అవరోధాలను గుర్తించి  రోడ్డు మధ్యలో ఉన్న కొన్ని అడ్డంకి వస్తువులను తొలగించాడు. ఆ సమయంలో ట్రాఫిక్లో చిక్కుకున్న ఒక ఫోటోగ్రాఫర్, డ్యూటీ చేస్తున్న పొలిసు చర్యను తన కెమెరాలో బంధించాడు. దుబాయ్ పోలీసు అధికారి అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి అధికారి ట్రాఫిక్ పోలీస్ మహహ్దీ పోషించిన సానుకూల పాత్రను ఈ సందర్భంగా ప్రశంసించాడు. " ఆయన తీసుకొన్న చర్యలను బట్టి దుబాయ్ పోలీసులు గర్విస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com