ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. రాత్రిపూట పెరుగు వేసుకోకూడదా?

- October 08, 2017 , by Maagulf
ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. రాత్రిపూట పెరుగు వేసుకోకూడదా?

మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ ''సి'' ఉన్న సహజమైన ఆహారం తీసుకోవడం మంచిది. బత్తాయి, ద్రాక్ష, క్యాలీఫ్లవర్, నారింజ, నిమ్మ, మామిడి పళ్ళను తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అలాగే మెగ్నీషియం ఉన్న గోధుమలు, బాదం, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఉదయం పూట పెరుగు, వెన్న, పాలు తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని పక్కనబెట్టవచ్చు.
 
కానీ రాత్రిపూట మాత్రం పెరుగు తీసుకుంటే ఒత్తిడి ఖాయం. మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా ఒత్తిడి దానిద్వారా ఏర్పడే అనారోగ్య రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. తీపిపదార్థాలు మితంగా, కొంచెం కారం, ఉప్పు వున్న వంటకాలు తీసుకోవడం మంచిది. రాత్రిపూట వేడి పాలు, పటికబెల్లం కలిపి తీసుకోవాలి. ప్రతిరోజూ పులుపు లేని తియన్ని పళ్ళ రసం తాగండి. అన్నింటికంటే ముందు రాత్రి పదిగంటలకల్లా నిద్రపోవడం మంచిది. 
 
ఇక సైకలాజికల్ పరంగా ప్రణాళికతో జీవనం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ ఏదో ఒక మంచి భావాన్ని పెంటే పని చేయండి. తీరని సమస్యల గురించి ఆలోచించకుండా వెంటనే మరో వ్యాపకానికి మారిపోండి. యోగా చేయండి. ఒత్తిడికి కారణమయ్యే పనులను వరుస క్రమంలో పూర్తి చేయండి. మీలో ఆత్మవిశ్వాసాన్ని, మీ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com