కోవా కోన్స్
- October 18, 2017కావలసినవి: మైదా - 250 గ్రా, నెయ్యి - 100 గ్రా, పంచదార పొడి - 100 గ్రా, పాలు - 100గ్రా, నూనె - వేపుడుకు సరిపడా.
కోవా ఫిల్లింగ్ కోసం: పచ్చి కోవా - 250 గ్రా, పంచదార - 50 గ్రా, డ్రై ఫ్రూట్స్ తరుగు - 1 కప్పు (జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష).
తయారీ: మైదా, నెయ్యి, పంచదార పొడి, పాలు కలిపి మెత్తని ముద్దగా చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకుని రోటీలా వత్తుకోవాలి. ఈ రోటీని సన్నని పట్టీలుగా కట్ చేసుకోవాలి. ఈ మైదా పట్టీలను మెటల్ కోన్ పైనుంచి కిందవరకూ చుట్టి అంచుల్ని పాలు తడిపి అతికించాలి. ఈ కోన్లను నూనెలో వేయించుకుని చల్లారాక వేరు చేయాలి. మరో బాండీలో కోవా వేసి చిన్న మంట మీద 10 ని.లు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. మరో గిన్నెలో వేయించిన ఖోయా, డ్రై ఫ్రూట్స్, పంచదార వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేయించి పెట్టుకున్న కోన్స్‌లో నింపి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్