డిసెంబర్ 1న రానున్న జవాన్.!
- October 19, 2017అతి తక్కువ టైం లో మెగా హీరో అనిపించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్..రేయ్ తో నిరాశ పరిచిన కానీ ఆ తర్వాత వరుస విజయాలతో తన దూకుడును కనపరిచాడు. ఇటీవల నక్షత్రం మూవీ లో గెస్ట్ రోల్ లో కనిపించి మెగా ఫ్యాన్స్ ను అలరించిన ఇతడు త్వరలో బివిఎస్ రవి దర్శకత్వం లో జవాన్ అంటూ రాబోతున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్స్ , టీజర్ తో సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యం లో ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించినప్పటికీ , కథ లో కొన్ని మార్పులు చేయడం తో సినిమా రి షూట్ చేయడానికి నిర్ణయించారు. దాంతో సినిమా ముందుగా అనుకున్న టైం కు కాకుండా డిసెంబర్ 1న ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తపై పూర్తి క్లారిటీ రావాలంటే నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వచ్చి చూడాల్సిందే. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా కనిపించనుంది. తేజ్ ఈ సినిమాలో దేశమా, కుటుంబమా అనే సంఘర్షణను ఎదుర్కునే ఒక భాద్యత గల యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే వినాయక్ దర్శకత్వం లో మరో సినిమా చేస్తున్నాడు తేజు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన