"కేరాఫ్ సూర్య" కోసం సూర్య
- October 20, 2017తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ ను మలుపు తిప్పే బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం సినిమా కూడా నిరాశపరచటంతో తదుపరి చిత్రం కేరాఫ్ సూర్య విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందీప్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న కేరాఫ్ సూర్య పనుల్లో బిజీగా ఉన్నాడు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఆడియో వేడుకను చెన్నైలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ నటుడు సూర్య ముఖ్య అతిథి హాజరు కానున్నారట. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
తాజా వార్తలు
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ