ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- May 03, 2024
హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ ను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు.
ఆయా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో ప్రవేశాలకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా మూడు విడతల్లో ఈ ప్రక్రియ ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని పొడిగించారు. ఈ మేరకు బోర్డు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 4వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని స్పష్టంచేశారు. వాస్తవానికి ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గురువారంతో పూర్తయింది. కానీ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే కారణంగా 4వ తేదీ వరకు పొడిగించారు. ఇదిలా ఉండగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జరగనున్నాయి.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







