యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- May 03, 2024
యూఏఈ: యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చాలా మంది నివాసితులు ఇళ్లకే పరిమితం అయ్యారు. శుక్రవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. పార్కులు మరియు బీచ్‌లు మూసివేశారు. విమానాశ్రయాలు మరియు విమానయాన సంస్థలు వాతావరణ పరిస్థితులను బట్టి సర్వీసులను మళ్లింపు, రద్దు చేస్తున్నారు. జాతీయ వాతావరణ కేంద్రం (NCM) జారీ చేసిన హెచ్చరికల ప్రకారం గురువారం దుబాయ్‌లో తెల్లవారుజామున 2.35 గంటలకే వర్షాలు ప్రారంభం అయ్యాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. దుబాయ్ RTA ఇంటర్‌సిటీ బస్సు సేవలను నిలిపివేసింది. అనంరతం ప్రారంభించింది. షార్జా ఆర్టీఏ గురువారం రాత్రి 9 గంటల తర్వాత ఇంటర్‌సిటీ బస్సు సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..