మరోసారి రిలీజ్ డేట్ మారిన ఆక్సిజన్ మూవీ
- October 21, 2017గోపీచంద్ కెరియర్ ప్రస్తుతం ఏ మాత్రం బాగులేదు..చేసిన సినిమాలు వరుసపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అవుతుంటే , షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు మాత్రం పలు వాయిదాలతో రిలీజ్ డేట్స్ మారుస్తూ ముందుకు సాగుతున్నాయి. ఆరడుగుల బుల్లెట్, ఆక్సిజన్ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని నెలలు గడుస్తున్నా రిలీజ్ కు మాత్రం నోచుకోవడం లేదు. ఎట్టకేలకు ఆక్సిజన్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర యూనిట్. గతం లో అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించినప్పటికీ , ఇప్పుడు ఆ డేట్ ను మార్చారు. తాజాగా నవంబర్ 10 న సినిమా థియేటర్స్ లోకి వస్తుందని తెలిపారు. మరోపక్క అక్టోబర్ 23న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెయ్యబోతున్నారు, ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిధిగా వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ చాల రోజుల క్రితమే అన్ని పనుల్ని పూర్తి చేసుకున్నా ఏవో కారణాల వలన విడుదల వాయిదాపడుతూ వచ్చింది. అందుకే ఇకపై ఆలస్యం చేయకూడదని భావించిన చిత్ర నిర్మాతలు రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ విరివిగా వాడి రూపొందించిన ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ను శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.ఐశ్వర్య నిర్మించారు. మరి ఈ సినేమైనా గోపీచంద్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!