మసూర్ పప్పు సూప్
- November 04, 2017కావలసిన పదార్థాలు: మసూర్ పప్పు (ఎర్ర పప్పు) - అర కప్పు, క్యారెట్, టమోటా గుజ్జు - 1 టేబుల్ స్పూను చొప్పున, నూనె - ఒకటిన్నర స్పూను, ఉల్లిపాయ తరుగు - అరకప్పు, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను, జీరాపొడి - అర టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, వెజిటెబుల్ స్టాక్ - 2 కప్పులు, నీరు - 1 కప్పు, కొత్తిమీర తరుగు - గుప్పెడు, నిమ్మరసం - 1 టేబుల్ స్పూను, రోస్టెడ్ బ్రెడ్ ముక్కలు తగినన్ని.
తయారుచేసే విధానం: మసూర్పప్పుని అరగంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి. నూనెలో ఉల్లి, వెల్లుల్లి తరుగు నిమిషం పాటు వేగించి జీరా, మిరియాల పొడులు, ఉప్పు, వెజిటెబుల్ స్టాక్, నీరు, నానిన పప్పు, క్యారెట్ టమోటా గుజ్జు వేసి 30 నిమిషాలు ఉడికించాలి. పప్పు మెత్తబడి సూప్ చిక్కబడ్డాక దించి నిమ్మరసం కలిపి, కప్పులో వేసి కొత్తిమీరతో అలంకరించి తాగాలి.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…