ఫేక్‌ గన్‌తో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్‌

ఫేక్‌ గన్‌తో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్‌

సౌదీ అరేబియా: సౌదీ పోలీస్‌, నైజీరియాకి చెందిన వ్యక్తిని దొంగతనం కేసులో అరెస్ట్‌ చేయడం జరిగింది. రియాద్‌లోని సౌదీ కుటుంబాన్ని ఫేక్‌ గన్‌తో బెదిరించి పట్ట పగలే నిందితుడు దోపిడీకి పాల్పడ్డాడు. రియాద్‌లో ఇలాంటి దొంగతనం ఇంతకుముందెన్నడూ జరగలేదని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. దోపిడీ ఘటనకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డ్‌ అయిన టేటాను పోలీసులు విశ్లేషించారు. అనంతరం 38 ఏళ్ళ నిందితుడ్ని ట్రాప్‌ చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దొంగతనం చేసే క్రమంలో సెక్యూరిటీ కెమెరాని కూడా నిందితుడు ధ్వంసం చేశాడు. గేట్‌ దూకిన నిందితుడు సర్వైలెన్స్‌ కెమెరాని బ్రేక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. విల్లాలోని మహిళను ఫేక్‌ గన్‌తో బెదిరించగా, ఆమె కుమారుడు సకాలంలో అక్కడికి చేరుకుని, దొంగని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా, దొంగ పారిపోయాడు. అనంతరం అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆయుధాలతో దొంగతనాలకు పాల్పడేవారిపై సౌదీలో కఠిన చర్యలుంటాయి. మరణ శిక్షలు సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది నిందితులకి.

Back to Top