కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 2018 ట్రాఫిక్ గణాంకాలు
- February 12, 2018
కువైట్: జనవరి 2018 నాటికి అంతర్గత వ్యవహారాల శాఖ, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం, 2,171,961 మంది ప్రయాణికులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రాయం నుంచి వెలుపల ప్రాంతాలకు ప్రయాణమయ్యారు. అదేవిధంగా 536,142 మంది కేవలం గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన పౌరులు ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. అలాగే ఇక్కడకు వస్తున్నా పౌరులు సంఖ్య 922,433 చేరుకుంది. ఇంతలో, ఇతర దేశాలకు చెందిన ప్రయాణికుల సంఖ్య 759,619 చేరుకుంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జారీ చేసిన వీసాల సంఖ్య 14,319 మంది. వేలిముద్రల ఆధారంగా 85 మంది గతంలో కువైట్ దేశం నుంచి బహిష్కరించబడ్డ వారని ఈ సందర్భంగా గుర్తించారు. ఐదుగురు వ్యక్తులు నకిలీ పాస్పోర్ట్ లతో అరెస్టు కాబడ్డారు. 112 మందిని సంబంధించిన అధికారుల వద్దకు పంపబడ్డారు. అదేవిధంగా గతంలో దేశ బహిష్కరణకు గురైన పదిహేను మందిని నిబంధన కాలం ముగిసిన తరువాత కువైట్ దేశంలోకి అనుమతించబడ్డారు, మరో 11 మందిని దేశంలోకి ప్రవేశించడానికి అధికారులు అనుమతించలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!