ఒమన్‌లో టొబాకోపై ట్యాక్స్ పెంపు
- February 12, 2018
మస్కట్: ఒమన్‌లో టొబాకోపై ట్యాక్స్ పెరగనుంది. ఇది రెండింతలు కానున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. 200 శాతం వరకు పెంపు ఉంటుందని, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాయల్ హాస్పిటల్ సీనియర్ అధికారి మాట్లాడుతూ, టొబాకో వాడకాన్ని తగ్గించేందుకోసం ముందుగా టొబాకో వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. అలాగే పొగాకు వాడకంపై నిషేధాజ్ఞలు విధించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. టొబాకో ఉత్పత్తులపై ట్యాక్స్ పెంచడం మరో మార్గం. ఈ మూడూ ఒకేసారి చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2016లో ఒమన్‌లో టొబాకోపై ట్యాక్స్‌ని 100 శాతం పెంచింది. జిసిసిలోని మిగతా దేశాలూ ఇదే తరహా చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి







