మిస్‌ తియారా ఇండియా బ్యూటీ విత్‌ పర్పస్‌గా రీతూ రావు

ముంబై:మిస్‌ అండ్‌ మిసెస్‌ తియారా ఇండియా 2018 ఫినాలే ఈవెంట్‌ ఘనంగా జరిగింది. మహా కవి కాళిదాసు ఆడిటోరియం ములుంద్‌లో ఫిబ్రవరి 6న జరిగిన ఈ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రీతూ రావు పాటిబండ్ల టాప్‌ 3 కంటెస్టెంట్స్‌ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. టీన్‌ కేటగిరీలో ఆమెకు ఫస్ట్‌ రన్నరప్‌గా ఛాన్స్‌ దక్కింది. అలాగే రీతూరావు 'మిస్‌ తియారా ఇండియా బ్యూటీ విత్‌ పర్పస్‌' టైటిల్‌ కూడా సొంతం చేసుకుంది. విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ గురించి మాట్లాడారు. చైల్డ్‌ ఎబ్యూజ్‌, సెక్సువల్‌ హెరాష్‌మెంట్‌, స్లేవరీ, ఈక్వాలిటీ, యాసిడ్‌ ఎటాక్స్‌ వంటి విషయాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టారు. ఈ కారణంగానే ఆమెకు 'బ్యూటీ విత్‌ పర్సస్‌' టైటిల్‌ దక్కింది. షిబానీ కశ్యప్‌ సాంగ్స్‌ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పరాస్‌ తోమర్‌, సిమ్రాన్‌ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 

Back to Top