ఏపీఈడీబీ - వుడ్‌కో ఎల్‌ఎల్‌సి మధ్య ఎంఓయూ
- February 12, 2018
దుబాయ్:ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ - వుడ్కో ఎల్‌ఎల్‌సి సంస్థల మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ కుదిరింది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏపీఈడీబీ, అలాగే యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన వుడ్‌కో ఎల్‌ఎల్‌సి, సంస్థల మధ్య కుదిరిన ఈ అవగాహనా ఒప్పందం విలువ సుమారు 1605 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేదా తిరుపతిలో సుమారు 50 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా 100 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. హై క్వాలిటీ ఫర్నిచర్‌కి సంబంధించిన మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నెలకొల్పడం ఈ ఒప్పందం లక్ష్యం. యూఏఈలోని దుబాయ్‌లో 11 ఫిబ్రవరి 2018న ఈ అవగాహనా ఒప్పందం ఏపీ ప్రభుత్వ సంస్థ ఎపిఇడిబి తరపున కృష్ణ కిషోర్ జాస్తి అలాగే యూఏఈ సంస్థ వుడ్కో ఎల్‌ఎల్‌సి తరపున హమీద్ మధ్య కుదిరింది.వీరితో పాటు యశ్వంత్ సమ్మెట(ఎపిఇడిబి,ఎగ్జిక్యూటివ్),ప్రేమ్ చంద్(ఎపిఇడిబి,ఎగ్జిక్యూటివ్) కూడా పాల్గొన్నారు.ఈ ఒప్పందంకి సంభందించిన విషయంలో నాదెళ్ల బాలాజీ(నాదెళ్ల ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్సి చైర్మన్) మరియు జాఫర్ అలీ ( APNRT కో-ఆర్డినేటర్,యు.ఏ.ఈ) తగిన కృషి చేసారు.

తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







