తొలి సౌదీ - అమెరికన్ మూవీ 'అరేబియన్ వారియర్'
- March 12, 2018దుబాయ్: తొలి సౌదీ - అమెరికన్ మూవీ ప్రొడక్షన్ 'అరేబియన్ వారియర్' మిడిల్ ఈస్ట్ ప్రీమియర్ సోమవారం రాత్రి రాక్సీ సినిమాస్ - సిటీ వాక్ - దుబాయ్‌లో జరిగింది. లాస్ ఏంజెల్స్‌కి చెందిన సౌదీ సోదరులు Aymen, Mohammad Khoja ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర Anmar గా, ఈజిప్టియన్ నటుడు Amir El Masry నటించారు. హాలీవుడ్లో ఇప్పుడిప్పుడే మంచి నటుడిగా ఎదుగుతున్నారాయన."రోజ్‌వాటర్' అనే మూవీతో 2014లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ప్రీమియర్ ఈవెంట్‌ని SVK Events LLC నిర్వహించింది.Vasanth kumar(Managing Director) ఈ ఈవెంట్‌ని పర్యవేక్షించారు. ఆర్కిటెక్చర్ చదువుతోన్న అన్మర్కి, తన డ్రీమ్ సాకర్ ప్లేయర్ అయ్యే అవకాశం వస్తుంది. అయితే తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ అందకపోవడంతో అతను తన డ్రీమ్‌ని ఎలా నెరవేర్చుకున్నాడన్నది ఈ సినిమా కథ. ఈ సినిమా ప్రీమియర్ షో ఈవెంట్ కి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు