దేశవ్యాప్తంగా 47 ఇండిగో విమానాలు రద్దు
- March 12, 2018
ముంబై : పౌర విమాన శాఖ కఠిన నిర్ణయం తీసుకున్నది. దీంతో ఏ320నియోస్ విమానాలు గ్రౌండ్ అయ్యాయి. ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లు ఉన్న విమానాలను నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అకస్మాత్తుగా నిర్ణయించింది. ఈ కారణంగా ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా 47 విమానాలను రద్దు చేసింది. గోఎయిర్‌కు సంబంధించిన మరో మూడు విమానాలను కూడా రద్దు చేశారు. 47 విమానాలను నిలిపేసినట్లు ఇండిగో ఇవాళ నత వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తా, హైదరాబాద్, బెంగుళూర్, పాట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్‌సర్, గౌహతిల నుంచి ప్రారంభం అయ్యే విమానాలను రద్దు చేశారు. సోమవారం అకస్మాత్తుగా ఇండిగో విమానం ఒకటి గాల్లోనే తీవ్ర వడిదిడుకులకు లోనైంది. దీంతో డీజీసీఏ తక్షణం అలాంటి విమానాలను రద్దు చేయాలని ఆదేశించింది. ఇంజిన్ సమస్యలు ఉన్న ఏ320నియో ప్లేన్లను ఫిబ్రవరిలోనే గ్రౌండ్ చేశారు. విమానాలను ల్యాండ్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే ఉండిపోయారు. దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ ప్రతి రోజు సుమారు వెయ్యి సర్వీసులను నడుపుతున్నది.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







