బాలయ్య సరసన విద్య బాలన్?!
- March 13, 2018నందమూరి అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ పైనే వుంది. ఈ కారణంగానే ఈ సినిమాకి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి వాళ్లంతా ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనుండగా, ఎన్టీఆర్ సతీమణి పాత్రను ఎవరు పోషించనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
నిజ జీవిత పాత్రలను, బరువైన పాత్రలను పోషించడంలో విద్యాబాలన్ అసమానమైన ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. ఆ తరహా పాత్రలకు ఆమె నిండుదనాన్ని తీసుకొస్తూ ఉంటారు. అందువల్లనే ఆమెను దర్శకుడు తేజ కలిసి కథ .. పాత్ర గురించి వివరించారట. దాంతో వెంటనే ఈ సినిమా చేయడానికి విద్యాబాలన్ అంగీకరించారని చెబుతున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన ప్రారంభించనున్నారు. ఆ రోజున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలిసే ఛాన్స్ వుంది.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…