ప్రాణభయంతో విమానం రెక్కలోంచి దూకేశారు
- March 13, 2018
డల్లాస్ : ప్రాణ భయంతో విమానం రెక్కలోంచి ప్రయాణికులు దూకేసిన ఘటన అల్బుకర్క్యూ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్(మెక్సికో)లో చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో విమానం ల్యాండ్ కాగా.. పేలిపోతుందన్న భయంతో ప్రయాణికులు ఈ పనికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది.
సౌత్ వెస్ట్ ఎయిర్వేస్కు చెందిన విమానం ఆదివారం రాత్రి ప్రయాణికులతో ఫోయెనిక్స్(అరిజోనా) నుంచి లవ్ ఫీల్డ్(డల్లాస్)కు బయలుదేరింది. అయితే కాసేపటికే క్యాబిన్లో ఏదో వాసన వస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది విషయాన్ని పైలెట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలో వేడి ఎక్కువగా ఉందంటూ ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. క్యాబిన్లో పొగలు రావటం ప్రారంభం కాగా.. ప్రమాద సంకేతాలు కనిపించటంతో పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌కు సిద్ధమయ్యాడు.
అల్బుకర్క్యూ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులంతా బయటకు వస్తున్న క్రమంలో.. ఇద్దరు ప్రయాణికులు మాత్రం విమానం రెక్క వద్ద ఉన్న ఎమర్జెన్సీ డోర్ నుంచి రన్‌వే పైకి దూకేశారు. అది గమనించిన ఓ ప్రయాణికుడు వారిద్దరూ అలా దూకటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సుమారు 8 అడుగుల ఎత్తు నుంచి దూకటంతో వారికి గాయాలైనట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ వేరే విమానంలో తరలించిన ఎయిర్వేస్.. గాయపడిన వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









