3 నెలల్లో ఒమన్‌లో 90 అక్రమ నిర్మాణాల తొలగింపు

3 నెలల్లో ఒమన్‌లో 90 అక్రమ నిర్మాణాల తొలగింపు

మస్కట్‌: దోఫార్‌ మునిసిపాలిటీ, 94 అక్రమ నిర్మాణాల్ని విలాయత్‌ ఆఫ్‌ సలాలాలో గడచిన మూడు నెలల్లో తొలగించింది. మార్చి నెలలో 17 అక్రమ నిర్మాణాల్ని తొలగిస్తే, జనవరిలో 77 నిర్మానాల్ని తొలగించారు. ఈ నిర్మాణాల్లో బ్రిక్స్‌, వుడ్‌, వైర్‌, ఐరన్‌ వంటివాటిని తయారుచేస్తున్నారు. భూముల్ని అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, విలాయత్‌ ఆఫ్‌ సలాలాలో ఎప్పటికప్పుడు మునిసిపాలిటీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

Back to Top