మోహన్ బాబు "కామెంట్స్" కు థమన్ రిప్లై
- March 13, 2018
మదన్ రామిగాని దర్శకత్వంలో సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్, విశ్వ నట సార్వభౌమ మోహన్ బాబు నటించిన చిత్రం 'గాయత్రి' ఫిబ్రవరి 9న విడుదలయిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా విడుదలవకముందు సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థమన్ పైన సంచలన వాఖ్యలు చేశాడు మోహన్ బాబు. "థమన్ లో టాలెంట్ ఉంది కాని బాగా బద్ధకస్తుడు. అతనితో పని చేయడం చాలా కష్టం" అని వివాదాస్పద వాఖ్యలు చేశాడు.
అయితే ఇన్నాళ్లు దీనిపై థమన్ స్పందించలేదు కాని తాజాగా ఒక వార్తా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ మోహన్ బాబు అనిన మాటలకు స్పందించాడు. మోహన్ బాబు గారు మిమ్మలను బద్ధకస్తుడు అని సంబోధించారు దీనికి మీరు ఎలా స్పందిస్తారు అని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ప్రశ్న సంధించింది. దీనికి థమన్ "దీనికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆయన ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ వ్యక్తుల్లో ఒకరు. కాబట్టి ఆయన లాంటి వాళ్ళను మనం గౌరవించాలి" అని స్పందించాడు.
థమన్ ఇంకా మాట్లాడుతూ- " ఆయన చెప్పిన మాటలను నేను ఆశీర్వాదంగానే పరిగణిస్తాను. ఆయన మా అమ్మకు చాలా మంచి మిత్రుడు కావడం, ఇంకా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించి జనవరి మొదటి తారీఖునే వారికి సంగీతం అంతా ఇచ్చేసాను. అయితే ముందు నాకు నేను కంపోజ్ చేసిన మ్యూజిక్ నచ్చకపోవడంతో వారిని రెండు, మూడు సార్లు మళ్ళీ కలవండి అని చెప్పాను. ఆయనకి సమయానికి అన్నీ జరిగిపోవాలి కాబట్టి బహుశా అలా అని ఉండవచ్చు" అని తెలిపాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







