భవనం పైనుంచి పడి 3 ఏళ్ళ చిన్నారి మృతి
- March 13, 2018
మూడేళ్ళ అరబ్ బాలిక, అబుదాబీలోని ఓ భవనం 12వ అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయింది. కిటికీకి దగ్గరలో ఫర్నిచర్ వుండటంతో, ఆ ఫర్నిచర్‌పైకెక్కి, అక్కడి నుంచి ఆ బాలిక కిందకు పడిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఖలిదియా ప్రాంతంలో మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన గురించి సమాచారం అందుకోగానే పోలీస్ మరియు పారామెడిక్స్ అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ బాలిక మృతి చెందింది. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ - మెట్రో పాలిటన్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ హమాద్ అల్ నియాది మాట్లాడుతూ, చిన్న పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేయడం మంచిది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నిర్లక్ష్యమే ఓ చిన్నారిని బలికొందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







