15 ప్లోర్లున్న బిల్డింగ్ 10 సెకన్లలో నేలమట్టం
- March 29, 2018ఏదైనా కట్టాలంటే కష్టం గానీ కూలగొట్టాలంటే ఎంత సేపు. మరి 15 అంతస్థుల భవనాన్ని కట్టడానికి ఎంత మంది పని చేసి ఉంటారు. ఎన్ని నెలలు పని చేసి ఉంటారు. అదే భవనాన్ని కూల్చేయాలంటే లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తే 10 సెకన్లు చాలంటుంది చైనా. చెంగ్డూ సిటీలోని రద్దీగా ఉన్న ఓ ఏరియాలో 15 అంతస్థుల భవనం ఉంది. అది చాలా ఏళ్ల క్రితం కట్టిందని దాన్ని కూలగొట్టి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పెద్ధ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకున్నాడు ఆ బిల్డింగ్ యజమాని. అనుకున్నదే తడవుగా రెస్క్యూటీమ్కి కబురు చేశారు. వారు వచ్చి కేవలం 10 సెకన్లు మాత్రమే అంటే కన్ను మూసి తెరిచే లోగా బిల్డింగ్‌ని కూల్చేశారు సిబ్బంది. 15 అంతస్థుల బిల్డింగ్ ఒక్కసారిగా నేలమట్టం కావడంతో దుమ్ము బాగా లేచింది. చుట్టుపక్కల మొత్తం దట్టమైన పొగలా అలుముకుంది. వెంటనే రెస్క్యూ టీమ్ నీటితో తడిపి దుమ్ముని కాస్త తగ్గించారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!