'కృష్ణార్జున యుద్ధం' ట్రైలర్ విడుదల
- March 31, 2018నేచురల్ స్టార్ నాని 21వ చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. ఇందులో కృష్ణుడు, అర్జునుడు కూడా నానియే. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిజా సంగీతం సమకూర్చారు. నాని, గాంధీ ఇద్దరూ సక్సెస్ఫుల్ ఫామ్‌లో ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
2 నిమిషాల 8 సెకన్ల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్లో నాని తెగ హంగామా చేశారు. ఈ ఊళ్లో కృష్ణ అంటే ఎవరు?. అందరి వెంటపడి ప్రపోజ్ చేస్తాడట కదా! అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటూ సాగిపోతోంది. పల్లెటూరి కుర్రోడిగా కృష్ణ రూపంలో కన్పించిన నాని రాక్ స్టార్‌గా అర్జున్ రూపంలో కన్పిస్తున్నాడు. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఏప్రిల్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్