ఓట్స్ చికెన్ టిక్కా

ఓట్స్ చికెన్ టిక్కా

కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా, ఓట్స్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - రెండు టీ స్పూన్లు, పచ్చిబఠాణీలు - రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - స్పూన, పెరుగు - 3 టేబుల్‌ స్పూన్లు, పుదీనా ఆకులు - టేబుల్‌ స్పూన్.
 
తయారీ పద్ధతి: చికెన్‌ను గ్రైండ్‌ చేసి పేస్ట్‌లా చేయాలి. ఇందులో ఓట్స్‌, పెరుగు, పుదీనా పేస్ట్‌, పచ్చిబఠానీల పేస్ట్‌, కారం, ఉప్పు కలపాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని అరచేతిలో వత్తి బియ్యప్పిండిలో అద్ది నాన్‌స్టిక్‌ పాన్ మీద వేయించాలి. వీటి తయారీకి నూనె వాడాల్సిన అవసరం లేదు.

Back to Top