ఇండియా:చల్లని కబురు చెప్పిన వాతావరణ విభాగం

- April 16, 2018 , by Maagulf
ఇండియా:చల్లని కబురు చెప్పిన వాతావరణ విభాగం

భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది భారత్‌లో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని వెల్లడించింది. న్యూస్ కానన్ఫరెన్స్‌లో 2018సంవత్సరానికి సంబంధించి తొలి వాతావరణ అంచనాలను ఐఎండి విడుదల చేసింది. 97శాతం సాధారణ వర్షపాతాన్ని అంచనా వేస్తున్నట్లు ఐఎండి డైరక్టర్ జనరల్ కేజే రమేష్ తెలిపారు. గత రెండేళ్లలో భారత్‌లో మంచి వర్షాలు పడటంతో పంటలు బాగా పండాయని, అదే స్థాయిలో ఈ ఏడాది కూడా వర్షాలు మెండుగా ఉంటాయని రమేష్ చెప్పారు. 

మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో కేరళకు రుతుపవనాలు వస్తాయని ఐఎండి తెలిపింది. 45రోజుల్లో అవి దేశమంతటా విస్తరిస్తాయని ప్రకటించింది. ఎల్నినో ప్రభావం తక్కువ ఉందన్న భారత వాతావరణ శాఖ.. న్యూట్రల్ కూడా అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. సాధారణ వర్షపాతం కేవలం వ్యవసాయ వృద్ధిని పెంచడమే కాకుండా.. గ్రామీ ఆర్ధిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపనుందని తెలిపింది. ఇది బీజేపి ప్రభుత్వానికి ఎంతో కీలకమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2019లో సాధారణ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రభుత్వానికి ఐఎండీ గుడ్‌న్యూస్ చెప్పిందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com