రామ్ చరణ్, బోయపాటి షూటింగ్ ప్రారంభం
- April 22, 2018
రంగస్థలం తరవాత ఏ మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదు రామ్ చరణ్. తన తరువాతి చిత్రం కోసం నేటి నుంచి షూటింగ్‌కు హాజరయ్యాడు. ఈ రోజు నుండి బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్‌పైకి వచ్చేశాడు. మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో తన 12వ చిత్రాన్ని చెర్రీ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్‌లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. నేటి నుంచి మూడో షెడ్యుల్‌ను ప్రారంభించారు. బోయపాటి మార్క్ అల్ట్రా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందీ సినిమా. రామ్ చరణ్‌ని డిఫెరెంట్ డైమెన్షన్‌లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాడు బోయపాటి.
ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రశాంత్, స్నేహ, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. డివివి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన భరత్ అను నేను ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. ఇప్పటికే ఈ మూవీకి రాజవంశస్థుడు అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







