అగ్నిమాపక రంగంలో మహిళ..ఎఎఐలో భాద్యతలు చేపట్టనున్న తానియా

అగ్నిమాపక రంగంలో మహిళ..ఎఎఐలో భాద్యతలు చేపట్టనున్న తానియా

కోల్‌కతా : అగ్నిమాపక రంగంలో కోల్‌కతా యువతి తానియా సన్యాల్‌ రావడంతోపాటు మొట్టమొదటి అగ్నిమాపక మహిళా సిబ్బందిగా రికార్డు స అష్టించనున్నారు. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ)లో 3,310 మంది పురుషులు ఫైర్‌ఫైటర్లుగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క మహిళను కూడా నియమించలేదు. తాజాగా ఎఎఐ తానియా సన్యాల్‌ను ఫైర్‌ఫైటర్‌గా నియమించింది. ఆమెకు ప్రస్తుతం ఫైర్‌ ఫైటింగ్‌లో శిక్షణ ఇస్తోంది. మరో నెలలో ఆమె ఫైర్‌ఫైటర్‌గా పూర్తి స్థాయిలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఎఎఐ చైర్మన్‌ గురుప్రసాద్‌ మాట్లాడుతూ విమానాశ్రయాల విస్తరణ, నూతన విమానాశ్రయాల నిర్మాణం వల్ల ఫైర్‌ఫైటర్ల కొరత ఏర్పడిందన్నారు. అందుకే ఈ రంగంలోకి మహిళలను తీసుకురావాలని నిర్ణయించామన్నారు. పురుషుల కనీస బరువు 50 కేజీలు ఉండాలనే నిబంధన ఉందని, అయితే మహిళా అభ్యర్థుల కనీస బరువు 40 కేజీలకు తగ్గించేలా నిబంధనలలో మార్పు చేశామన్నారు. తాను ఫైర్‌ఫైటర్‌నవడం గర్వకారణమని, తనకు ఎంతో గౌరవం దక్కిందని తానియా తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది నిర్వహించే ఉద్యోగ బాధ్యతలు అత్యంత సమున్నతమైనవని ఆమె పేర్కొన్నారు.

Back to Top