సుకుమార్ తో మరో సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్

సుకుమార్ తో మరో సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్

భరత్‌ అనే నేను సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మరో సినిమాను కన్ఫామ్ చేశాడు. సుకుమార్‌ దర్శకత్వంలో తన 26వ సినిమా చేసేందుకు అంగీకరించాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన వన్‌ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా టెక్నికల్‌గా ఆకట్టుకోవటంతో మరోసారి సుకుమార్‌తో కలిసి పనిచేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. 

Back to Top