అతి పెద్ద విమానం.. అంతరిక్ష ప్రయాణం..!!
- April 22, 2018కొలరాడో, అమెరికా : ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ‘స్ట్రాటో లాంచ్’ అతి త్వరలోనే తొలిసారి గగనయానం చేయనుంది. దాదాపు ఫుట్బాల్ మైదానమంత భారీ రెక్కలు కలిగిన ఈ విమానానికి రెండు కాక్పిట్స్, 28 చక్రాలు, ఆరు ఇంజన్లను అమర్చారు. సాధారణంగా ఆరు ఇంజన్లలతో 747 జంబో జెట్లను నడపొచ్చు.
భవిష్యత్లో ఈ విమానం ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడానికి, అంతరిక్ష యానానికి వెళ్లే ప్రజలను భూమి నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్కు చేర్చడానికి ఉపయోగపడనుంది. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పాల్ అలెన్ కలలకు రూపం స్ట్రాటో లాంచ్.
కొలరాడోలో జరిగిన 34వ స్పేస్ సింపోజియంలో ఈ వేసవిలో విమానం తొలిసారి గగనతల విహారానికి వెళ్లనుందనే ప్రకటన వెలువడింది. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు స్ట్రోటో లాంచ్ కొన్ని రాకెట్లను మోసుకెళ్లనుంది కూడా. ప్రస్తుతం ఉన్న అన్ని టెక్నాలజీల కన్నా అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోని స్ట్రాటో లాంచ్ ద్వారా ప్రయాణించొచ్చని పాల్ అలెన్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు