బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి'
- April 24, 2018తెలుగులో సంచలన విజయం సాధించిన సినిమా 'అర్జున్ రెడ్డి'. చిన్న చిన్న పాత్రలు చేసుకునే విజయ్ దేవరకొండ కు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా 'అర్జున్ రెడ్డి'. పొగరున్న, స్వచ్చమయిన ప్రేమికుడిగా .. విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన అర్జున్ రెడ్డి.. 50 కోట్లు వసూల్ చేసి ఇండియన్ సినిమా ని తన వైపు తిప్పుకుంది. తమిళం లో చియాన్ విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా 'వర్మ ' పేరుతో బాలా దర్శకత్వం లో 'అర్జున్ రెడ్డి ' రీమేక్ అవుతున్నది.
హిందీ లో మాత్రం, అర్జున్ రెడ్డి సినిమాకోసం హీరోగా ఎవరిని తీసుకోవాలనేది. మొన్నటివరకు.. సస్పెన్స్ గానే ఉన్నది. కొంతకాలం అర్జున్ కపూర్ అని , మరో సారి షాహిద్ కపూర్ అని పుకార్లు చక్కలు కొట్టాయి.అర్జున్ కపూరే అని అందరు అనుకుంటున్నా తరుణం లో .. నిర్మాతలు అసలు హీరో ఎవరనేది ప్రకటించేసారు.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. షాహిద్ కపూర్ వారం రోజుల క్రితమే 'అర్జున్ రెడ్డి' రీమేక్ సైన్ చేసినట్లు సమాచారం. పద్మావతి సక్సెస్ తో ఉన్న షాహిద్, కోపిష్టి అయిన మెడికో పాత్రలో కరెక్ట్ గా సరిపోతాడని, నెటిజెన్ల తీర్పు. హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కానీ ఈ సినిమాను .. అశ్విన్ వార్డే, మురాద్ ఖేతని నిర్మిస్తున్నారు. ఈ హిందీ రీమేక్ ను ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి నే డైరెక్ట్ చేయడం విశేషం.జులై నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా సందీప్ కి బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!