లేటెస్ట్ టెక్నాలజీతో బంగారం స్మగ్లింగ్...
- April 27, 2018
శంషాబాద్:దొరికితే కదా దొంగ.. దొరక్కపోతే దొరే. స్కానింగ్ సెన్సార్ మిషన్లకి కూడా దొరక్కుండా పక్కా ప్లాన్ చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బంగారం స్మగ్లింగ్ చేద్దామనుకున్నారు. కానీ అడ్డంగా బుక్కయ్యారు. ఎల్ఈడీ బ్యాటరీలో ఎనిమిది బంగారు రేకుల్ని తీసుకువచ్చిన ఓ వ్యక్తిని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. 445 గ్రాములు ఉన్న ఈ బంగారం ఖరీదు రూ.14 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దుబాయ్‌కి చెందిన ఓ ముఠానే ఎల్‌ఈడీ బ్యాటరీ ద్వారా బంగారం అక్రమణ రవాణా మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ నుంచి వచ్చిన అతడిని విచారించగా తనకేమీ తెలియదని ఎలాంటి వివరాలు చెప్పకుండా ఆ లైట్‌ను తీసుకుని హైదరాబాద్ వెళ్లమన్నారని, అక్కడ తమ వారు వచ్చి తీసుకుంటారని చెప్పారన్నాడు. అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న ఆ వ్యక్తిని విమాన సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి బ్యాగులో ఉన్న ఎల్‌ఈడీ లైట్‌ను పరిశీలించగా బ్యాటరీల తీరులో మార్పు కనిపించింది. పగుల గొట్టి చూడగా వారి అనుమానాన్ని నిజం చేస్తూ లోపల నల్లటి పొడితో కప్పి ఉంచిన బంగారం రేకులు ఎనిమిది బయటపడ్డాయి. అయితే దీని వెనుక పెద్ద బంగారం స్మగ్లింగ్ రాకెట్ ఉండి ఉండవచ్చని కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టే ఆలోచనలో ఉన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







