సౌదీ అరేబియాలో మహిళ జిమ్‌లపై నిషేధం...
- April 29, 2018సౌదీ అరేబియా:కఠిన చట్టాలకు మారుపేరైన సౌదీ అరేబియాలో మహిళ జిమ్‌లపై నిషేధం విధించారు. ఒక అమ్మాయి రియాద్‌లోని ఒక జిమ్ సెంటర్లో స్కిన్ టైట్ దుస్తులు ధరించి వ్యాయమం చేసింది. దాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అదికాస్త వైరల్ అయింది. దాంతో మహిళల జిమ్‌లను నిషేధిస్తూ సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ తుర్కీ అల్ షేక్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటిని తాము సహించేది లేదని తేల్చి చెప్పారు.
మహిళలు స్కిన్ టైట్ దుస్తులు ధరించడం సౌదీలో నిషేధం. అదే విధంగా ఆ వీడియోను ఆధారం చేసుకుని దర్యాప్తు చేయాలని తుర్కీ ఆదేశించారు. క్రీడల్లో మహిళలపై నిషేధాన్ని 2014లో ఎత్తేసిన సౌదీ ప్రభుత్వం కొన్ని నిబంధనలతో అనుమతించింది. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి హలిమా బోలంద్ అని తేలింది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని నేను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. సౌదీ న్యాయ వ్యవస్థపై తను పూర్తి నమ్మకం ఉందని అన్నారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..