దుబాయిలో తాండ్ర(జి) వాసి మృతి

- April 29, 2018 , by Maagulf
దుబాయిలో తాండ్ర(జి) వాసి మృతి

తాండ్ర(జి)(సారంగాపూర్‌): తాండ్ర(జి) గ్రామానికి చెందిన మహ్మద్‌ తాజొద్దిన్‌(22) దుబాయిలో గుండె పోటుతో మృతి చెందారు. ఈ నెల 26న విధులు ముగించుకుని తన గదికి రాగా..తెల్లవారే సరికి నిద్రలోనే ప్రాణాలు విడిచారు. స్నేహితులు ద్వారా ఈ విషయం తెలిసిందని తల్లిదండ్రులు ఆదివారం వివరించారు. తాజొద్దిన్‌ది నిరుపేద కుటుంబం కావడంతో ఉపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లారు. తండ్రి అన్నుసాబ్‌, పెద్దన్న రాజాక్‌ మృతి చెందారు. మరో అన్న ఇబ్రహీమ్‌తో కలిసి తాజొద్దిన్‌ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంతలో యువకుడు గుండె పోటుతో మృతి చెందడం ఆ కటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. మృతుడికి తల్లి, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ప్రభుత్వం చొరవ చూపి కుమారుడి మృతదేహం త్వరగా ఇంటికి వచ్చేలా చూడాలని తల్లి నన్నుబి విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com