సౌదీ అరేబియాలో మహిళ జిమ్‌లపై నిషేధం...
- April 29, 2018
సౌదీ అరేబియా:కఠిన చట్టాలకు మారుపేరైన సౌదీ అరేబియాలో మహిళ జిమ్‌లపై నిషేధం విధించారు. ఒక అమ్మాయి రియాద్‌లోని ఒక జిమ్ సెంటర్‌లో స్కిన్ టైట్ దుస్తులు ధరించి వ్యాయమం చేసింది. దాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అదికాస్త వైరల్ అయింది. దాంతో మహిళల జిమ్‌లను నిషేధిస్తూ సౌదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ తుర్కీ అల్ షేక్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటిని తాము సహించేది లేదని తేల్చి చెప్పారు.
మహిళలు స్కిన్ టైట్ దుస్తులు ధరించడం సౌదీలో నిషేధం. అదే విధంగా ఆ వీడియోను ఆధారం చేసుకుని దర్యాప్తు చేయాలని తుర్కీ ఆదేశించారు. క్రీడల్లో మహిళలపై నిషేధాన్ని 2014లో ఎత్తేసిన సౌదీ ప్రభుత్వం కొన్ని నిబంధనలతో అనుమతించింది. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి హలిమా బోలంద్ అని తేలింది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని నేను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. సౌదీ న్యాయ వ్యవస్థపై తను పూర్తి నమ్మకం ఉందని అన్నారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా