అల్లు అర్జున్ నట విశ్వరూపం చూస్తారు - నిర్మాత లగడపాటి శ్
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
అల్లు అర్జున్ నట విశ్వరూపం చూస్తారు - నిర్మాత లగడపాటి శ్రీధర్(వీడియోతో..)

అల్లు అర్జున్ నట విశ్వరూపం చూస్తారు - నిర్మాత లగడపాటి శ్రీధర్(వీడియోతో..)

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, అను ఇమాన్యుయేల్‌ జంటగా వక్కంతం వంశీ ధర్శకత్వంలో కె.నాగబాబు సమర్పకులుగా శిరీషా శ్రీధర్‌, బన్నివాసు నిర్మించిన నా పేరు సూర్య (నా ఇల్లు ఇండియా) చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈ
చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ, ఎవడిగోల వాడిది, స్టైల్‌ చిత్రాలను చూసిన బన్ని నన్ను ఓ అభిరుచిగల నిర్మాతగా భావించి పదేళ్ల క్రితం నాకు సినిమా చేస్తానని మాట ఇచ్చారు. తనే పిలిచి ఈ సినిమాకు నాకు అవకాశం ఇచ్చారు. ఇలా మాట నిలబెట్టుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఆయన నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూస్తారు అని చెప్పారు.