'మయ్యమ్ విజిల్' పార్టీ యాప్‌ను ప్రారంభించిన కమల్
- April 30, 2018చెన్నై: ప్రముఖ సినీ నటుడు, 'మక్కల్ నీది మయ్యమ్' అధినేత కమల్ హాసన్ మంగళవారం 'మయ్మమ్ విజిల్' అనే పేరుతో పార్టీకి చెందిన యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ పార్టీ నేతలకు అలారమ్లాంటిదని, సామాన్య ప్రజల సమస్యలను తెలసుకోవడానికి మా పార్టీ నేతలు పాత్రికేయుల్లాగా పనిచేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో నమోదు చేసిన నేతలకు, వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటాము కాని, వెంటనే పరిష్కారం చూపలేమని, ఎందుకంటే ఈ యాప్ మంత్రదండం కాదని ఆయన అన్నారు. అధికారులు, నేతలపై పర్యవేక్షణకు ఈ యాప్ ఉపపయోగపడుతుందన్నారు. తమిళనాడును అవినీతి రహితంగా మార్చడమే తన రాజకీయ అజెండా అంటూ ఫిబ్రవరిలో 'మక్కల్ నీది మయ్యమ్' అనే పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు