చిన్నారి చేతిని రక్షించిన సివిల్ డిఫెన్స్
- May 01, 2018
గ్లాస్ డోర్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి చేతిని అత్యంత చాకచక్యంగా సివిల్ డిఫెన్స్ సిబ్బంది రక్షించారు. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సివిల్ డిఫెన్స్‌ని అప్రమత్తం చేసింది. అప్రమత్తమయిన సివిల్ డిఫెన్స్ సిబ్బంది, చాలా జాగ్రత్తగా గ్లాస్ డోర్ నుంచి చిన్నారి చేతిని బయటకు తీశారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా తల్లిదండ్రులు, తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ పేర్కొంది. అనుకోకుండా కొన్నిసార్లు ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటాయనీ, పిల్లల భద్రతకే తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంటుందని అధికారులు సూచించారు. ఒక్కోసారి చిన్న చిన్న ప్రమాదాలు, ప్రాణాల్ని హరించవచ్చునని అధికారులు తల్లిదండ్రుల్ని హెచ్చరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!